ఒక్క రోజు ముచ్చట

ఒక్క రోజు ముచ్చట 

ఆకాశంలో సగమంటాం!

భాగస్వామ్యం లేదంటాం!

బరువునిపెంచీ, బాధ్యతమరిచీ,

పక్కకితప్పుకు నిలబడతాం!

అబలవి కాదూ సబలంటాం!

అత్యాచారాల్జేస్తుంటాం!

ఆక్రోశంలో, ఆవేదనలో, చోద్యం చూస్తూ నవ్వేస్తాం!

ఆస్థిలొ నీకూ హక్కంటాం!

జీతం మొత్తం లాక్కుంటాం!

లెక్కలడిగితే, డొక్కచించుతా అంటూ స్వరాన్ని పెంచేస్తాం!

అణుకువఉంటే అలంకరణ అని;

ఆవేశాలవి తగదని, తప్పని;

అనాదియుగమూ, అర్వాచీనం అణగదొక్కుతూ బతికేస్తాం!

అపుడో, ఇపుడో మేల్కొంటాం!

సమానత్వమని రంకేస్తాం!

ఆరోజొకటది గడిచినవెంటనె, గురకలుపెడుతూ తొంగుంటాం!

 

– వాక్కేళి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *