క్షణ భంగురం
మానుకందం విరులు,
విరుల కందం మగువ
మగువ కందం భంధం
బంధనికందం ప్రేమ
ప్రేమకందం అనురాగం
అనురాగానికందం ఆప్యాయత
ఆప్యాయత కందం తోలి రాత్రి
రాత్రికదం సుమాల మాలలు.
మాలల కందం సిగ్గులు
సిగ్గులకందం మొగ్గలు
మొగ్గ పువ్వై ఫలాన్ని ఇస్తే
ఆ ఇల్లే ఆనందాల మకరందం
ఆ మకరందం తేనే తుట్టగా మారి
గ్రోలిన మలి వయసందం,
మలి వయసు లోని అందాలన్నీ మృగ్యమై
ఆప్యాయత అందని ద్రాక్షై,
వృద్దాప్యo నరకమైతే ,
అందరాని అందమంతా నీరై నింగిలోకి జారితే
నీ అంతిమ యాత్ర కట్టే పై విరిసిన సుమాలు
కన్నీళ్ళ కవితలు రాస్తే..
ఇంతేనా క్షణ భంగుర జీవనందం
అనిపించక మానునా ఎవరికైనా…
– శారద దేవి