బంకర్ బ్రతుకు
బంకర్ అంటే బంగారుగని కాదు
బ్రతుకు జీవుడా అని
బ్రతికే చోటు
మానవాళి మనుగడ ఒక
ప్రశ్నగా మిగిలేది
హింస ఆగేనా బ్రతుకు
నిలిచేనా వేచి చూస్తున్న
బ్రతుకు పోరాటం
బాంబుల చప్పుళ్ళు
బరితెగించిన విన్యాసాలు
అదృశ్య శక్తుల అరాచకం
కుయుక్తులు పన్నాగాలు
విచక్షణ లేని కుసంకల్పం
గతితప్పిన మాటలు
గాడి తప్పిన స్వేచ్ఛకు
శక్తి వంతపు హితవులైనా
ఎదురు చూసేసాయమైనా
ఏమిటీ సంక్షోభం ఎందుకీ
మారణ హోమం ఒక్కసారి చూడు
బంకర్ బ్రతుకు గుండె చెరువై పోతుంది.
– జి.జయ