ప్రయాణ మధురిమలు

ప్రయాణ మధురిమలు

అది 2001-02 సంవత్సరం అప్పుడే చదువు కోసం వేరే ఊరు (అత్తమ్మ వాళ్ళ ఊరికి) వెళ్లాను. ఆరోతరగతి మధ్యలో మానేశాక ఏడో తరగతిలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలో చేరడానికి వెళ్లాను…

ప్రిన్సిపాల్ గారు ఏదో చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఏడో తరగతిలో జాయిన్ చేసుకున్నారు. అలా ఆ ఊరితో పరిచయం ఏర్పడింది. మామూలు తరగతులతో పాటు సాయంత్రం పూట కూడా ట్యూషన్లు పెట్టేవారు. రాత్రి పూట కూడా పాఠశాలలోనే నిద్రించడం.

ఉదయం మరలా ఇంటికి వెళ్లడం తినడం అత్తమ్మ క్యారియర్ పెడితే వచ్చేయడం. సాయంత్రం మరలా ఇంటికి వెళ్లి కాలకృత్యాలు ముగించుకోవడం… సాయంత్రం ఎక్కువగా మా క్లాస్మేట్ రవితోపాటు ఇద్దరం ఎక్కువగా కలిసి ఖాళీ నడకతో వెళ్లేవాళ్ళం… ఆ సంవత్సరం బాగా గడిచింది…

అక్కడ అప్పట్లో మూసి పారుతుండేది దానిలో మా తరగతి వాళ్ళతో వెళ్లడం వాళ్ళతో పాటు అలా తిరిగి రావడం… ఓసారి అట్లతద్ది పండుగ వచ్చింది ఆరోజు అందరం కలిసి ఓ పదిమంది దాకా కూర్చుని ఒకరివి ఒకరం మార్చుకొని తినడం నాకు ఇప్పటికీ జ్ఞాపకం…

ఊరికి వచ్చేటప్పుడు టౌన్ నుండి మా నాన్న సైకిల్ మీద (మా నాన్న తో కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాణ్ణీ) ఇంటికి వచ్చేవాణ్ణి… మరలా వెళ్ళేరోజు మా నాన్న సైకిల్ మీద టౌన్ లో దిగపెడితే నేను వెంటనే పాఠశాలకు వెళ్లకుండా ఓ సినిమా చూసుకొని సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి తరగతిలో ఉండేవాణ్ణి…

సంవత్సరం చివరికి మంచి మార్కులతో నాలుగోస్థానంతో (పాంప్లేట్ అదే మొదటగా పేరు చూసుకోవడం ఇప్పటికీ ఆ పాంప్లేట్ ని జాగ్రత్తగా పెట్టుకున్నాను)

అప్పుడే ఓ చిన్న గుర్తింపు వచ్చింది… ఈ అబ్బాయి పర్లేదు చదువుతాడు అని ప్రిన్సిపాల్ ఎవరితోనో అన్నారట… ఆ విషయం నా చెవికీ చేరడం సంతోషాన్ని ఇచ్చింది…

ఓసారి సాంఘిక శాస్త్రంలో మా క్లాస్ టీచర్ ఏవో చదువుకొని రమ్మని చెబితే చదువుకొని వచ్చాను తప్పు చెబితే చెంపదెబ్బలు ఒప్పు చెప్పినవాళ్ళతో వేపించేవారు… చెంపదెబ్బ పడకూడదని గట్టిగా చదువుకొని వెళ్లాను… చెంపదెబ్బలు బెడద లేకుండా పోయింది…

వీడ్కోలు సంబరం కూడా బాగా చేశారు… రకరకాల స్పీచ్లు… రకరకాల డ్యాన్స్ లతో సాగింది వాటిని చూస్తూ అలా గడిపేశాను… సరదా సరదగా ఆ సంవత్సరం గడిచిపోయింది. అలా ఆ ఊరితో అక్కడ వ్యక్తులతో పరిచయం ఇప్పటికీ నాకో జ్ఞాపకం…

ఇది ఆనాటి నా ఏడవ తరగతి ప్రయాణం… మధురానుభూతినిచ్చింది… ఓ జ్ఞాపకాన్ని ప్రయాణం రూపంలో పంచుకునే అవకాశం ఇచ్చిన అక్షరలిపికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను….

– గోగుల నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *