సృష్టి
మధువులు చిందే మధుమాసం
జలజల పారే జలపాతం
పువ్వుల నిండిన మకరందం
ముచ్చటగొలిపే నెమలందం
మహోన్నతమౌ హిమశిఖరం
భీతినిగొలిపే నడి సంద్రం
హాయిని నింపే సుమగంధం
అంతే తెలియని ఆకాశం
పక్షులు, పశువులు, వన సంపదలు
తరుణి, హరిణి, పగలు, రేయి
ఊహకు చాలని అందాలెన్నో
సృష్టించాడు ఆ దైవం
– రవి.పీసపాటి