ఆదర్శ మార్గం
కాలం చెల్లిన భావజాలాలను బద్దలుకొట్టి,
నవశకానికి నాంది పలికేది,
అచేతనంగా పడివున్న సమాజ జీవశ్చవాన్ని కదిలించి
గొంతెత్తి ప్రశ్నించేది,
నిరాశావాదంలో కొట్టుమిట్టాడే నవతరం
యువతని విప్లవశంఖమై నడిపించేది,
అంధకారంలో నిద్రాణమైన జగతిని
జాగృతం చేసి నవోదయాన్ని చూపించేది.
– శివ.KKR