బంధం
స్తబ్దత నిండిన మనసుని సైతం
శృతిలయల సంగమంగా మార్చగలిగేది
ప్రపంచం అంతా ఏకమై , నిన్ను అపహాస్యం చేసినా
నీకై నీకోసమై ప్రతిఘటించగలిగేది
పగవాళ్ళ చురకత్తి లాంటి మాటలను సైతం
తన మాటలతో నీకు ఉపశమనం కలిగించేది
నీకన్నా నీగురించి ఎక్కువగా ఆలోచించి
ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది
బంధం చాలా ముఖ్యమైంది, అమూల్యమైనది, అనిర్వచనీయమైనది
బంధం నిలుపుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకు
బంధాలను బంధంతో బంధించు..
-హిమ