వెన్నెల రోజులు
విరహాన్ని దాచుకుని ప్రియుడి కై వేచి చూసే
పడతి కి తెలుసు వెన్నెల అందం
విరహం తో వేగి పోతూ ప్రియురాలి కోసం వెళ్ళే
ప్రియుడు పాడుకునే వెన్నెల గీతం
వయసులో ఉన్న దంపతులు కోరే వెన్నెల పాన్పు
అందమైన ఆడపిల్లలు ఊహల మాలలు కట్టేది వెన్నెల లో
అందమైన చేతులకు గోరింటాకు పెట్టుకుని అది పండిన తర్వాత దాని అందాన్ని చూసేది వెన్నెల వెలుగు లోనే
ఆరుబయట నులక మంచం లో పడుకుని
అందమైన ఆకాశం వంక చూస్తూ ఆ వెన్నెల్లో
కాబోయే శ్రీమతి గురించి కవితలల్లుతూ ఊహల్లో తేలిపోతూ ఉండే పడుచు కుర్రాళ్లను ఆపతరమా
అమ్మ చేతి గోరు ముద్దలు తినకుండా పరుగెత్తే పాపాయి నీ అపగలమా
వెన్నెల్లో విహరించే ఆడపిల్ల ఊహలను అపగలనా
వాటన్నిటికీ నేను కూడా ఒక సాక్ష్యమే కదా…..
ప్రణవ్