గాయం
అయ్యో అప్పుడే వెళ్లి పోయావా
ఏమంత తొందర వచ్చిందని వెళ్ళావు
మీతో ఎన్నో మాట్లాడాలని అనుకున్నానే
మీతో ఎన్నో పనులు చేయించాలని అనుకున్నా నే
ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకున్నాం
ఆ కబుర్ల లో నుండి అక్షర పదాలను
కలుపుతూ మీలోని ఆవేశాన్ని బయటకు
ఇంకా ఇంకా తేవాలని అనుకున్నా నే
కదులుతున్న కాలం తీరు లను
నిగ్గు తేల్చేందుకు , సిగ్గు లేని సమాజాన్ని
మార్చేందుకు మీ మా అక్షరాల నీరాజనం
జనాలకు అందించాలని అనుకున్నానే
మీ తరాలన్ని ముందు తరాలకు ఆదర్శం
కావటానికి మీతో కలిసి పని చేయాలని
అనుకున్న నా ఆశలన్నీ ఆవిరి అయ్యేలా
కాలం ఒక్క క్షణకాలం స్తంభించెలా చేసావే
అవ్వన్నీ అవ్వక ముందే …
అందరికన్నా ముందే ఏమంత తొందర
పడ్డావు , అవును లే మమల్ని మీరు
ఒక్కసారి అయినా చూస్తే కదా తెలిసేది
మేమనుకున్నవన్ని మీరు వింటే కదా
మా బాధ మీకు తెలిసేది.
మీరు మాకు తెలుసు కానీ మేమే
మీకు తెలియదు అందుకని మా ఆశలు
ఆశయాలు లక్ష్యాలు వినకుండా నే
మేమనుకున్న పనులు మీరు మాకు
చేయకుండానే మీ పనులు మీరే
చేసుకోండి అంటూ ….
ఇన్ని రోజులూ
చేశాను , ఇక అలసి పోయాను అంటూ
ఇలా అర్ధాంతరంగా అలిగి వెళ్లావా … అయ్యా
అయ్యో ఎందుకంత తొందర మీకు….
అయినా పర్లేదు మీ ఆశల్లో , ఆశయాల్లో
క్షరాలలో , అక్షరాలలో సదా మీ ధ్యానం లో ,
సదా మీ మాటల్లో నిజాలను నిగ్గు తెలుస్తూ..
సమాజాన్ని కడుగుతూ ..సదా మీ అడుగు జాడల్లో…..
ఇక సెలవ్
– Aksharalipi
నిజంగా చాలా గొప్ప రచయిత.
ఆయన పాటలు అచంద్రతారార్కం ప్రజల మనసులో ఉంటాయి.
చాలా చాలా బాగుంది మేడం..నైస్..💐💐💐😌😌😌😌
బాగుంది. జ్ఞాపకం గాయానికి లేపనమవ్వాలిగాని , తిరుగతోడేదిగా ఉండకూడదు. ప్రతి మనిషిని ఏదో ఒక గాయం తొలుస్తూనే ఉంటుందని బాగా గుర్తుచేసారు. కృతజ్ఞతతో.