సంఘర్షణ పార్ట్ 1
మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, అయితే కొన్ని కారణాల వలన మనం మన మనసుకు నచ్చిన పనులు కాకుండా, నచ్చని పనులు ఎన్నో చేస్తుంటాం, అలాంటి ఒక పని వల్ల రెండు జీవితాలు ఎంత మానసిక సంఘర్షణలో కొట్టుకుపోయాయి. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
********
అమ్మ నాకు ఈ పెళ్లి వద్దమ్మ అన్నాడు అరుణ్. తల్లి దగ్గరికి వెళ్లి బతిమాలుతూ , ఏంట్రా ఇది అన్ని రెడి అయ్యాక ఆ మాటలేంటి ? నాన్నగారు విన్నారంటే చంపేస్తారు . నోరు మూసుకుని చేసుకో, ఇన్ని రోజులు మౌనంగా ఉండి , ఇప్పుడు వద్దు అని అంటే ఎలా ? అయినా నాన్నగారు మూర్తి అంకుల్ కు మాట ఇచ్చారు అంట . నువ్వు కాదంటే బాగుండదు .
వారం రోజుల లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా అంటే ఎట్లా ? మూసుకుని చేసుకో , అయినా అమ్మాయి బాగుంది కదా ఎందుకు వద్దు అంటున్నావు ? నీ ఫేస్ కి ఇంకా మంచి పిల్ల దొరకదు లే , వెధవ తెలివి తేటలు చూపించకు సరేనా , వెళ్ళు , వెళ్లి బట్టలు కొనుక్కో , అంటూ లోపలికి వెళ్తున్న తల్లిని చూస్తూ బిత్తరపోయారు అరుణ్….
*********
అమ్మా నేను చదువుకుంటానే , నాకు ఈ పెళ్లి వద్దు అమ్మా అంది కరుణ , నోరు మూసుకుని చెప్పింది చెయ్, అంతే కానీ వద్దు అని అంటే కాళ్ళు , చేతులు , విరిచేసి అయినా నీకు ఈ పెళ్లి చేస్తాం . సరేనా నీ కాళ్ళు, చేతులు బాగుండాలి అంటే చెప్పింది విని చేసుకో, అక్కడ మీ నాన్నగారి మాట పోతుంది. అర్థమయ్యిందా, హా, పో, పోయి మెహంది పెట్టించుకో వెళ్ళు అంటూ కసిరింది అనిత కూతురు కరుణ ను .
ఏంటి కత ఏమంటుంది,? అన్నారు మూర్తి గారు. ఆ ఏముంది పెళ్లి వద్దు అంటుంది. చదువుకుంటా అంటుంది , ఏం చేద్దాం అండి ? అంది అనిత , ఆ ఏముంది వారం లో పెళ్లి అంతే , అయినా ఎంత చదివినా పెళ్లి తప్పదు కదా , ఇప్పుడు అలాగే అంటారు.
పెళ్ళి అయితే తనే సర్దుకు పోతుంది లే, ఎప్పుడో ఒకసారి చేస్తే మనకు భారం తగ్గుతుంది. ఆ ,ఆ మాటలన్నీ ఒదిలేసి పని చూడు అంటూ బయటకు నడిచారు మూర్తి గారు. భారాన్ని దించుకోవాలి అనుకున్నారు తల్లిదండ్రులు.
*******
అరె చెప్తుంటే ఒకరు వినడం లేదు , నాకు ఇష్టం లేదు మొర్రో , అని అంటున్నా , జీవితాన్ని ఇంకా చూడాలి అంటే వినడం లేదు , పెళ్లి అంట పెళ్లి, ఎవడికి కావాలి పెళ్లి , నాకు ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు.
నేను ఇంకా జీవితాన్ని ఏమీ చూడలేదు. ఎంజాయ్ చేయలేదు , జాబ్ రాగానే పెళ్లి కి అన్ని ఫిక్స్ చేసి పిలిచారు. పెళ్లి అని తెలిసి నేను షాక్ అయ్యాను. అన్ని వీళ్ళ ఇష్టమేనా ? నాకంటూ ఇష్టాలు ఉండవా ? కోరికలు ఉండవా ? నేనెలా ఉండాలో వీళ్ళు డిసైడ్ చేయడం ఏంట్రా ? ఇప్పుడేం చేయాలి రా అంటూ అరుణ్ తన స్నేహితుడు అనిల్ తో ..
అరెయి , సరేరా నీ బాధ నాకర్థం అయింది. కానీ ఇప్పుడేం చేయలేము కదరా, వారం లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాదు అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అన్నాడు అనిల్.
నీ బొంద రా , వాళ్ళు చెప్పగానే వద్దు అన్నాను. కానీ వింటేనా అసలు వాళ్ళు చెప్పిందే వేదం లాగా , నన్ను బలి పశువును చేస్తున్నారు , అన్నాడు ఆవేదనగా అరుణ్ .
అది కాదు రా , ఇప్పుడు నువ్వు కాదు గదా , ఆ దేవుడు దిగి వచ్చినా ఏమీ చేయలేరు. కానీ ఒక మాట చెప్తాను విను , ఇప్పుడు పెళ్లి చేసుకో , అందర్నీ సంతోష పెట్టు , తర్వాత నీ ఇష్ట ప్రకారంగా తనని వదిలేసి , నీకు నచ్చినట్టు ఉందువు కానీ అన్నాడు అనిల్.
అదెలా సాధ్యం రా అన్నాడు అరుణ్. ఒరేయి పెళ్లి అయితే చేస్తారు. కానీ సంసారం మాత్రం చేయండి అని బలవంతం చేయలేరు కదా , అందువల్ల నువ్వేమి బాధపడకు , నేను చెప్పినట్టు చెయ్యి, ఇప్పుడెం అనకు, పెళ్లి ఇష్టం అన్నట్టే ఉండు, మనం చేసేది చేద్దాం అన్నాడు స్నేహితుని బాధ చూడలేని అనిల్.
అది కాదు రా, చేసుకున్న తర్వాత , మళ్ళి మనం కాదు , వద్దు అంటే ఆ పిల్ల ఎక్కడికి పోతుంది రా, అయినా నా పేరెంట్స్ ముందు నేను చెడ్డవాడిని , అవడం నాకు ఇష్టం లేదు రా , అన్నాడు అరుణ్. సరే రా ముందు అయితే పెళ్లి అవని తనకు నచ్చనట్టు ఉంటె ఆ అమ్మాయే నిన్ను వద్దు అనుకుంటుంది, తానె నిన్ను వద్దు అనేలా , మనం ప్రయత్నం చేద్దాం సరేనా , ఇక ఏం ఆలోచించకు అన్నాడు అనిల్.
సరే రా కానీ అలా జరుగుతుంది అంటావా ? అనుమానంగా అన్నాడు అరుణ్ . ఒరేయి నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి , నేను చెప్పింది చేయి, నేను ఉన్నా కదా నేను చూసుకుంటా , మై హు నా , అన్నాడు ఫోన్ లో అనిల్ ,
అదేరా నా భయ్యం కూడా , నువ్వు చెప్పినట్టు జరగలేదో , నీకు నా చేతిలో ఉంటుంది రా .. ఒరేయి ఇది నా జీవన్మరణ సమస్య , ఏ మాత్రం తేడా జరిగినా , నిన్ను చంపేస్తా అన్నాడు అరుణ్. అదేమి ఉండదు మావా , నేనున్నా కదా, నేను చూసుకుంటా లే , డోంట్ వర్రీ , సరే మరి నేను ఉంటాను.
ఆ పిల్లకు ఏమేం నచ్చదో , తెలుసుకునే పని లో ఉంటా,అన్నాడు అనిల్, సరే కానీ నువ్వు రా , రా నాకు భయంగా ఉంది. తోడూ గా ఎవరులేరు , అన్నాడు అరుణ్ ఫోన్ లో , వస్తలేరా రెండు రోజుల ముందే ఉంటా అన్నాడు అనిల్. లేదు కాదు ఇప్పుడే నువ్వు బండెక్కి వచ్చేయి, నాకేం పాలు పోవడం లేదు అన్నాడు అరుణ్ .
ఒరేయ్ మరి పిల్ల విషయం అన్నాడు అనిల్, అది తర్వాత చూసుకుందాం , కానీ నువ్వు వెంటనే బయలుదేరు, అంటూ ఉంటా ఇక , సాయంత్రం లోపు నువ్వు ఇక్కడ ఉండాలి , అంటూ ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేసాడు అరుణ్, ఒరేయ్ అది కాదు రా , అంటున్న అనిల్ మాటలు విననే లేదు. వీడికి ఏది వచ్చినా పట్టలేం, వెధవ అంటూ తిట్టుకుంటూ నాకు తప్పుతుందా ? అని బ్యాగ్ లో బట్టలు సర్దడం మొదలు పెట్టాడు అనిల్.
*******
Nice
Nice bavya
Bhagundhi 👌