కథలు రాయడం
ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒక దశకు చేరుకుని ఉంటారు, తాము పడిన కష్టాలు, ఎలా ఒక మంచి స్థితికి చేరుకున్నాము అనే అనుభవాలు, నలుగురికి చెప్తూ, తమ మనసులో రేగిన సంఘర్షణలు జీవితంలో జరిగిన ఆటుపోట్లు, సహాయం చేసిన వారిని, చేయని వారిని గుర్తు చేసుకుంటూ తమ లాగా ఎవరు చేయకూడదు అని అలా కాదు ఇలా చేయండి అంటూ సలహాలు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు.
అయితే కథలు రాయాలంటే మంచి భాష రావాలి, దాన్ని రాయడం రావాలి అని భావాన్ని వ్యక్తం చేయడం రావాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అదో పెద్ద తలనొప్పి గా భావించి ఆ ఎవరు రాస్తారు లే అని అనుకుంటారు కానీ అదే తప్పు ఎందుకంటే, మీ జీవిత పాఠాలు ఈ తరం వారికి ఒక దారిని చూపే మార్గ నిర్దేశం కావచ్చు, కాబట్టి మీ అనుభవాలు అందరికీ పంచండి. కథలుగా రాయండి ఎలా మాకు రాయడం రాదు, అదో పెద్ద జంజాటం అనుకోకుండా మీకు వచ్చిన బాషలో రాయండి, మీకు నచ్చిన విధంగా రాయండి, తప్పుల గురించి ఆలోచించకుండా మొదటి నుండి అన్ని చెప్పండి. మీరేలాంటి భాషలో మాట్లాడతారో అదే భాషలో రాయండి.
మామూలు వాడుక భాషను ప్రోత్స్తహించడం మా లక్ష్యం, గ్రాంధికం, గొట్టు పదాల అర్థాలు అందరికీ అర్దం కాకపోవచ్చు, కాబట్టి మామూలు వాడుక భాషలో రాయండి వాటిని మేము ప్రచురిస్తాం. నలుగురికి తెలిసేలా చేస్తాం. ఏవైనా రాయొచ్చు, ఎవరైనా రాయచ్చు, ఏ అంశం పైన అయినా రాయొచ్చు… మరి ఇంకెందుకు ఆలస్యం రాయండి చదవండి మన అక్షరలిపిలో… పరిమితి లేదు ఎంతైనా రాయండి, షరతులు వర్తిస్తాయి.
మీ కథలను ఈ లింకు పైన క్లిక్ చేసి మీరు రాసిన కథలను సబ్మిట్ చేయండి https://aksharalipi.com/submit-an-article/
చక్కగా వివరించారు.
మంచి సమాచారం అందించారు.
మంచి సమాచారం ఇచ్చారు.