70 ఏం.ఏం లైఫ్ 

70 ఏం.ఏం లైఫ్ 

ప్రతి పరిచయం వెనకాల ఓ అర్థం
చేసుకోలేని అపార్ధం దాగుటుంది

ప్రతి స్నేహం వెనకాల కొన్ని చెప్పలేని
వాస్తవ చేదు నిజాలుంటాయి

ప్రతి బంధం వెనకాల బంధి చేసే కొన్ని

నియంత్రణ కట్టుబాట్ల నియమాలుంటాయి

ప్రతి ప్రేమ వెనకాల ఓ స్వార్థంతో
నీగూఢమైన సంకుచిత భావన వుంటుంది

ప్రతి నమ్మకం వెనకాల ఓ అభద్రత
అనుమానం పుడుతు వుంటుంది

ప్రతి ఆశ వెనకాల ఓ నిరాశ

నిరుత్సాహం నిస్సహాయత ముంచేస్తుంది

ప్రతి కోరిక వెనకాల ఓ నిశ్శబ్ద
దుఃఖనది అంతరార్థనమవుతుంది

ప్రతి కల వెనకాల ఓ క్షణిక మాయ
వుంటుంది

ప్రతి క్షణిక మాయలో భ్రమించే
ఓ అద్భుత భూతకల్పన వుంటుంది

ప్రతి మనిషి వెనకాల కనపడని మరో
మనిషి కపట నాటక కోణం దాగుటుంది

ప్రతి నాటకం వెనకాల ఓ నాటకీయ
మాయ మర్మజాలం వుంటుంది

ఆ నాటక ముంగింపుకు అసలైన సూత్రధారి
ఒకడుంటాడు విధి లిఖితంలో తల రాత

ప్రాప్తంలో కాల ప్రవాహంలో తన్నుకు
పోతాడు,తెప్ప తగల వేస్తాడు..!!

-సైదాచారి మండోజు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *