24 కళలు
నిజానికి సినిమాలో 24 కళలు అంటారు,కానీ అది నిజం కాదు,మన మీద రుద్దిన ఒక సామెత లాంటిది.ముందు కాలంలో తెరపై ఒక క్షణం బొమ్మ కదలాలంటే ప్రొజెక్టర్లో రీలు సెకనుకి 24 ఫ్రేముల వేగంతో తిరగాలని తెలిసిందే కదా.
అందులోనుండొచ్చిందా 24. ఎవరో, ఎప్పుడో ఆది ప్రాస కోసం ’24 ఫ్రేములు, 24 కళలు’ అని పుట్టించి వదిలారు. అదలా అంటుకుపోయింది.
నిజానికి ఇప్పుడు కనీసం ఒక 35 రకాల బృందాలు కలిసి పని చేస్తేనే ఒక సినిమా తయారు అవుతుంది.
దర్శకులు,రచయితలు,నృత్య దర్శకులు,సంగీత దర్శకులు,ఎడిటర్ దగ్గర నుండి మేకప్ వేసే వారు,జూనియర్ ఆర్టిస్టులు,వారిని తీసుకుని వచ్చేవారు,అందులో పని చేసే డ్రైవర్లు,అందులో కరెంట్ విభాగంలో పని చేసేవారు,వి ఎఫ్ ఎక్స్ చేసేవారు,
మంచి మంచి సెట్లు వేసే వారు,మంచి మంచి లొకేషన్స్ వెతికి వారు,అందరికీ వండివార్చే అమ్మలు,ఫ్రేమ్ కి కలర్ మార్చే అన్నలు,డెకరేషన్ చేసే వాళ్ళు,
ఫైట్ మాస్టర్లు,జనరేటర్ గురించే చూసే వాళ్ళ అందరినీ మా సినిమా వాళ్ళే అనుకుంటాం.పోస్టర్ వేసే అన్న,సినిమా థియేటర్లో కూర్చొని ప్రొజెక్టర్ వేసే అన్న కూడా మా వాడే.ఇలా చాలా మంది కలిస్తేనే ఒక సినిమా మన వరకు వస్తుంది.
-ఈగ చైతన్య కుమార్