2000 రూపాయల నోటు రద్దు
అడ్డదారీలో సంపాదించిన అక్రమ సంపాదనంతా మీ ఖజానాలలో దాచిన నగదు డబ్బులు అన్ని రెండు వేల రూపాయల నోట్ల కట్టలే అనుకుంటా
కట్టలుగా కట్టబడి ఉరి తీయబడ్డ ₹2,000 రూపాయల కట్టలన్ని జీవచ్ఛవంలా చచ్చుబడిపోయి చెదపురుగులకు ఆహారంగా మారిపోతాయని సందేహం వచ్చిందో ఏమో
ఎంతైనా పెద్ద నోటు కదా మరి
క్షణానికో కోటీ చొప్పున
సంపాదిస్తున్న మీ రాబడి వేతనాలు
మిలియన్ ట్రిలియన్లలో దాచిన
డబ్బంతా ఉక్కపోతతో ఊపిరాడక
పచ్చిబట్టి పదునెక్కి నోట్లన్నీ
చినిగిపోతాయేమో
ఎంతైనా పెద్ద నోట్లు కదా మరి
రంగురంగుల అద్దాల మేడలు
తిరగడానికి బెంజ్ కార్లు
రోజుకో దేశానికైనా వెళ్లడానికి
మీకు సపరేటు ఫ్లైట్లు
ఎంత ఖర్చు చేసినా తరిగిపోని
నగదు డబ్బంతా కేంద్ర ప్రభుత్వం
ఇచ్చిన బంపర్ ఆఫర్
నగదు బదిలీ చేసి
పదిల పరుచుకోండి
ఎంతైనా పెద్ద నోట్లు కదా మరి
అవును మేము కూడా 2000
రూపాయల నోటును చూసాం కానీ
దాచుకునేంత ధనవంతులం కాదు
రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని
కడుపు కాల్చుకొని
కూలీ డబ్బులతో కాలమెల్ల
తీసేటోల్లం
గంత పెద్ద నోట్లు మా మధ్యతరగతి
కుటుంబాల్లో మా పేదల
పూరి గుడిసెల్లో ఎందుకు
దాచుకుంటాము
ఉన్నా కూడా చిల్లర చేయడానికి
ఊర్లో ఉన్న ఇల్లు గడప గడప
తిరగాల్సిందే
మాలాంటి ప్రజల దగ్గర
ఎందుకుఉంటుంది
అంత పెద్ద నోటు
ఎంతైనా పెద్ద నోటు కదా మరి
ఈ దేశంలో ఉన్న ప్రజల
సమస్యలను తీర్చకుండా
ప్రజలకు అవసరం లేని వాటిని
ముందు పెట్టి సమస్యగా
చూపించడం ఏంది
ప్రజలు ఏనాడు ఈ సమస్యపై
రాస్తారోకోలు, ధర్నాలు, బందులు
చేయలేదు పిలుపులు ఇవ్వలేదు
వారు ఈ సమస్యను ఎప్పుడూ
ముందుకు తీసుకురాలేదు
అయినా మీరు ఎందుకు
పెద్ద సమస్యగా ముందుకు
తీసుకొస్తున్నారు
ఈ 2000 రూపాయల పెద్ద
నోటు రద్దును ఎందుకు ప్రకటించారు
ఈ నోట్ల నగదు బదిలీల లెక్కలలో అవకతవకలు సృష్టించి ఉన్న ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి ఏదైనా కుట్రలు పంన్నుతున్నారా
ఇప్పటికే దేశం లో ఉన్న 90 శాతం సంపదను సృష్టించే అన్ని ప్రభుత్వ సెక్టార్లను కూని చేసి ప్రైవేట్ పరం చేస్తూ దేశం మొత్తం అప్పుల పాలు చేస్తిరి
ఇంకా ఈ 2000 నోటు రద్దుతో మా సామాన్య ప్రజల పైన, పేద ప్రజల పైన ఎంత పెనుబారం మోపు పడుతుందో ఏమో 😞
– బొమ్మెన రాజ్ కుమార్