వస్తాడు కొండలమాటున
వెలుగు ఉషోదయాల్ని తీసుకొని
క్రొత్త ఆశలతో కొత్త రోజుగా పద మళ్ళీ మన జీవితం మొదలు పెడదాం అన్నట్లు
అదిగో కొత్త జీవితం ఇంకెందుకు ఆలస్యం అన్నట్లు
జీవితం లో కష్టాలు కూడా ఉంటాయి అన్నట్లు ఎర్రటి ఎండను
ఇస్తూ అదే జీవితం లో వెలుగు ఉంటుంది అని తెలియచేస్తూ అలా సాగిపోతుంటాడు
చివరికి అదే కొండలలో కనుమరుగు అవుతాడు నీ రోజు శాశ్వతం కాదు అన్నట్లు
ఇదే రిపీట్ రోజూ…
వచ్చాడు ఈరోజు మళ్ళీ కొత్త రోజుగా సూరీడు
రహంతుల్లా