సుందరమైన నెలవంక
ఆకాశంలో నెలవంక
జీవితంలో అదృష్టం
జరిగేసరికి అమాంతం
చూడు ముచ్చట గొలిపి ప్రశాంతం
ఏడ నుండి వచ్చావు నెలవంక
నిన్ను చూస్తే మనసు అలవంక
ప్రపంచ దేశాలు నిన్ను మొక్కుకుంటది
ముస్లింలకు రంజాన్ నాడు
30 రోజులు నిన్ను చూడనదే భుజించరు
క్రైస్తవులు మరియమ్మ నాధుని గా నిన్ను మొక్కుదురు
ఎంత మంచి అందం ఓ నెలవంక
పునమినాడు చంద్రునిగా మారడానికి పట్టే సమయం
నిన్ను చూస్తే హిందువులు కూడా మురిసిపోతారు
అందమైన ప్రకృతి వి
అబ్బురపరిచే అందానివి
సృష్టిలో నిజమైన ఓ చంద్రునివి
నీవు ఒక నక్షత్రం
నీ వెంట ఉండే సౌందర్యం
తిలకించడానికి మనోహరం
సముద్రంలో నీళ్లు ఉప్పుల కనిపించవు
నోట్లో వేసుకుంటే దాని విలువ తెలుసును
అట్లే చందమామ నెలవంక రూపాన
అగుపడితే తెలుస్తుంది దాని విలువ
ఆడవారు మగవారు ఉపవాసాలు చేస్తారు
దానధర్మాలు చేస్తారు
త్రికరణ శుద్ధిగా నోముల నోస్తారు
పచ్చని గాలిలో
పల్లె సీమలలో
చెరువుగట్టు లో
సముద్ర చాయలలో
ఆ అందం చూస్తే బహు రమ్యం
చూడముచ్చట గొలుపే దైవాధీనం
మరచిపోకు నెలవంక మరల రా
నా నోముల పండేందుకు నన్ను మర్చిపోకు ఇలా
యడ్ల శ్రీనివాసరావు