రథసప్తమి విశిష్టత

*రథసప్తమి విశిష్టత*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷పురాణాలను … ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్యారాధనకి కాలంలో గల ప్రాధాన్యత అర్థమవుతుంది. అలాంటి సూర్యభగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజుగా ‘రథసప్తమి’ చెప్పబడుతోంది. లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు. ఈ వేయి కిరణాలలో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇందుకు సంకేతంగానే సూర్యుడు ఏడు గుర్రాలను కలిగిన రథంపై దర్శనమిస్తూ వుంటాడు. సూర్యుడు తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే ‘రథసప్తమి’ గా చెప్పబడుతోంది.

🌷ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడం కోసమే ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని నక్షత్రాలు రథం ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడనటానికి సూచనగా … ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లోను ఈ రోజున రథం ముగ్గులు కనిపిస్తుంటాయి. సూర్యభగవానుడికి ‘అర్కుడు’ అనే పేరుంది. అందువల్లనే ఆయనకి అర్కపత్రం (జిల్లేడు ఆకు) ప్రీతికరమైనదని అంటారు.

🌷ఈ కారణంగానే రథసప్తమి రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తారు. కొత్తబట్టలు ధరించి భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని పూజిస్తారు. కొత్త బియ్యం – కొత్త బెల్లాన్ని కలిపి తయారుచేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతి ద్వారా తమకి కావలసిన ఆహార పదార్థాలను అందిస్తోన్న సూర్యనారాయణమూర్తికి ఇది కృతజ్ఞతలు తెలియజేయడం లాంటిదని చెప్పుకోవచ్చు.

🌷రథసప్తమి రోజున ప్రసరించబడే సూర్యకిరణాలు, అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన జిల్లేడును విశేషమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. అందువలన ఈ రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పరమైన పుణ్యఫలాలతో పాటు ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు లభిస్తాయని ప్రాచీన గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

🌷చలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి.. రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది.. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా.. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది… శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది.. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..

🌷బరహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు… వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు…. అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట… దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట.

🌷ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు.. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి.. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..

🌷” జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే “🌷
అనే మంత్రంతో స్నానం చేయాలి..

🌷శరీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట.. సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి… మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!

🌷అందరం భక్తితో ” ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః ” అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం … ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సేకరణ

0 Replies to “రథసప్తమి విశిష్టత”

  1. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *