మహోత్కృష్టమైన మహిళామణులు
స్త్రీలే ఈ ప్రపంచానికి వెలుగురేఖలు. ప్రాచీన
కాలం నుండి అనేకమంది
మహిళామణులు తమ
అద్వితీయమైన ప్రతిభను,
తమ మహోత్కృష్టమైన
శక్తిని ప్రపంచానికి పరిచయం
చేసారు. మన దక్షిణ భారత
దేశంలోని రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని
సమర్ధవంతంగా పరిపాలించి
తన సత్తాను ప్రపంచానికి చాటి
భళా అనిపించుకున్నారు.
ఉత్తర భారతదేశంలో ఝాన్సీ
రాణి స్వాతంత్ర్య సమరంలో
పాల్గొని బ్రిటిష్ వారికి దడ
పుట్టించి, ఆ మహా సంగ్రామంలో వీరోచితంగా
పోరాడి ప్రాణార్పణ చేసారు.
ఇలా వ్రాసుకుంటూ పోతే
ఎందరో మహిళలు తమ
వీరత్వాన్ని ప్రదర్శించారు.
త్రేతాయుగంలో కూడా
దేవదానవ సంగ్రామంలో
దేవతల తరఫున పోరాడిన
దశరధ మహారాజుకు ఆయన
భార్య కైకేయి వెన్ను
దన్నుగా నిలిచింది. అలాగే
ద్వాపర యుగంలో సత్యభామ
తన పతి అయిన శ్రీకృష్ణునితో
పాటు యుద్ధరంగానికి వెళ్ళి
నరకాసురుడు అనే రాక్షసుని
వధించింది. కృత యుగంలో దుర్గాదేవి కూడా దేవతలకు
కూడా అలిమి కాని రాక్షసులను
సంహరించి లోక కళ్యాణానికి
దోహదపడింది. ఆధునిక
యుగంలో భారతీయ మాజీ
ప్రధాని ఇందిరాగాంధీ చాలా
సమర్ధవంతంగా భారత దేశాన్ని
ప్రపంచంలోనే అగ్రస్థానంలో
నిలబెట్టింది. వారందరూ
నేటి మహిళలకు ఆదర్శం.
స్త్రీ శక్తి ముందు లోకం
తలవంచక తప్పదు.
-వెంకట భాను ప్రసాద్ చలసాని