మన పండుగల గొప్పతనం తెలుసుకోండి.

మన పండుగల గొప్పతనం తెలుసుకోండి.

★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
★ *శ్రీరామ నవమి:-* భార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని కూడబెట్టుకోమని.
★ *వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
★ *నాగులచవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
★ *వరలక్ష్మి వ్రతం :-* నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

 

మన పండుగల గొప్పతనం తెలుసుకోండి.

 

★ *వినాయకచవితి (నవరాత్రులు) :-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
★ *దసరా ( ఆయుధ పూజ) :-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
★ *దీపావళి :-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
★ *కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
★*సంక్రాంతి :-* మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు              జరుపమని.
★*మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

*హోలీ :-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమున్నా కూడా తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.

0 Replies to “మన పండుగల గొప్పతనం తెలుసుకోండి.”

  1. తెలియని విషయాలెన్నో తెలియజేసారు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *