బతుకు విలువ

బతుకు విలువ

అరుణారుణ కిరణాలతో
కొత్త కాంతి మొదలైంది
ఇక సెలవంటూ మామనైవస్తానంటూ
తన గూటికి చేరుతున్నాడుచందురూడు

ఏదో ఆపద వస్తున్నట్టు ఎవరో తనని
అక్రమిస్తున్నట్టు హాని జరగబోతున్నట్టు
ఆకాశం రక్తం ప్రవహిస్తుంది,జరగబోయేది
ఏదో తనకు తెలుసన్నట్టు తెలియకనే తెలియ చెప్తుంది.

కోటి ఆశలతో కోరికలతో మరో ఉదయం
మొదలైంది.. బతుకునిచ్చేవి కొన్ని
బ్రతక నేర్పేవి కొన్ని ,బతుకు దారి
చూపేవి కొన్ని,ఎలా బ్రతకాలో నేర్పేవి కొన్ని
రంగులు మార్చే మనుషుల మధ్య నేనెంత అంటూ
ఆకాశం ఎర్రగా మారింది. బ్రతకడానికి నాటకాలు,
నటించడం నేర్చుకోమని తెలుపుతూ వెళ్తున్నా నేస్తం
అంటూ,బతుకు విలువ చెప్తుంది నెలవంక…

చాలిక సేలవంటూ నా బాధ్యత ముగిసిందని
అందరికీ సెలవు చెప్తూ వెళ్తుంటే,నేనున్నానంటూ సూర్యుని
రథచక్రాల్ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాల్

భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *