నా ప్రియమైన నీకు
ప్రేమతో నేను రాసే ఈ లేఖ..
అసలు నీతో ఎన్నో ముచ్చట్లు పెట్టాలని ఏవేవో ఊహలు..
తీరా రాసే టైం కేమీ గుర్తు రావడం లేదు..
అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని..
నిజమేనేమెా! ఒక్క గుడ్డిదే కాదు చెవిటి మూగ కూడా!
ఎందుకంటే?
నీ మీద ప్రేమతో నా మనసు పొరలు మూసుకు పోయాయి చూడు..
ఏమీ గుర్తు రాక ఏదీ జ్ఞాపకం లేక ఎలా అయిపోయానో?
మరి నిజమే కదా! ప్రేమ గుడ్డిదనడం!
నీ మీద ఎవరెన్ని చెప్పినా వినిపించడం లేదు కనిపించడం లేదు..
నా ప్రేమెుక్కటే తెలుస్తుంది మిత్రమా!
ఏం చెప్తున్నారో? తెలుసా?
అక్షర లిపి ఉండగా ప్రతిలిపి ఎందుకు దండగ ? అంటున్నాను
నేను వింటేగా?
నాకు అన్నీ కావాలి
మీ ముచ్చట్లు పండగ అంటున్నా!
అదీ సంగతి…
-ఉమాదేవి ఎర్రం