తొందరపడ్డ కోకిల
కొత్త రవికిరణాలకు అనుమతి ఇద్దాం
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం
కొత్త హంగులను రంగరిద్దాం
కొత్తదనాన్ని పుంజుకుందాం
కొత్త కాలానికి గౌరవిద్దాం
కొత్త ఆలోచనలతో అడుగులు వేద్దాం
పాత సాంప్రదాయాలు ఆచరిద్దాం
పాత ఆచారాలు విడకుండా నడుద్దాం
తొందర పడ్డ కోకిలమ్మ
కొత్త ఆశలను చిగురుప్పనిద్దాం
కొత్త సంవత్సరం అని పేరు చెప్పి
రాగింగు లకు పోవద్దు
మందుబాబులు అవ్వద్దు
కామాంధుకారులు అసలు కావొద్దు
పెద్దల దీవెనలు అందుకుందాం
కొదవ లేకుండా జీవితంలో రాణిద్దాం
కొంటె పనులు నీటితో మానేద్దాం
కోరికలను అదుపులో పెట్టేద్దాం
చట్టాన్ని వ్యతిరేకించక నడుద్దాం
పోలీసు వారికి సహకరిద్దాం
అతివేగం అనర్థానికి చేటు నిజం
మద్యపానం మన పాలిటి యమపాశం
మద్యం సేవించి వాహనం నడుపు రాదు
ఈ కొత్త సంవత్సరం నుండైనా
చెడ్డ అలవాటులను వ్యతిరేకిద్దాం
స్వతంత్ర గాంధీ కన్న కలలు నిజము చేద్దాం
ఉగాది వలె కోయిలమ్మ బ్రతికేద్దాం
తొందర పడ్డ కోకిల నేనే
నేను మారుతాను ముందు
పిదప అందరినీ మార్చుతాను
ఉగాది నవ యశస్సును నింపుతాను అందరి బ్రతుకుల్లో
నా రచన కవితా శైలికి రాజ్యం పోస్తా ఈ నూతన సంవత్సరం తో…!
యడ్ల శ్రీనివాసరావు