చందమామ
చూస్తున్నా మేఘాల మాటున చంద్రుణ్ణి,కనిపిస్తే ఒక మారు
నిన్ను తన నవ్వులతో పలకరించమని చెప్పాలని.
మేఘాల నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్న తారలకు చెప్పాలనుకుంటాను
కాస్త మెరుపై తనకు కనిపించమని.
మిణుకు మిణుకు మంటూ మురిపించమని.
చందమామ ఏమో తన మోమును చూసాక,
నన్ను ఎవరైనా చూస్తారా అని అడుగుతుంది.
చుక్కలు ఏమో తానే ఓ పెద్ద చుక్క.
తనతో కనిపిస్తే, తనకై కనిపిస్తే…
అనుకోరా మమ్మల్ని అందరు దిష్టి చుక్క
అని దాక్కున్నాయట.
ఇక వేటికి చెప్పను నీకు కమ్మని జోల పాడమని.
పూవులు ఏమో నీ నవ్వులకు సాయంకాలమే మూగబోయాయి.
పక్షులు ఏమో నీ సండదికి ఎప్పుడో చిన్నబోయి నిదురపోయాయి
ఒక్క రాతిరి మాత్రం మత్తుగా తూలుతుంది,
నువ్వు నవ్వుల వల విసిరావని కాబోలు.
భవ్యచారు