ఆడపిల్ల

ఆడపిల్ల పుట్టగానే..
ఇంటికి లక్ష్మి వచ్చిందంటారు..
అదే ఆడపిల్ల పెరిగి పెద్దవుతుంటే..
గుండెల్లో భారంగా భావిస్తారు..
కొందరు తల్లి తండ్రులు..
కానీ..
పెరుగుతుంటే ఆ ఆడపిల్ల..
గుండెలెంత భారంగా అవుతున్నాయెా..
ఎంత మందికి తెలుసు?
సమాజం వక్ర చూపులు..
తట్టుకోవాలి..
ఈ రాక్షస సమాజం నుండి తమ..
కన్యత్వం కాపాడుకోవాలి..
ఎవరేంటో తెలుసుకోవాలి..
ఆ సముద్ర ఘోష లాంటి ఘోష అనుభవించాలి..
ఆమె గుండెల్లో సముద్రపు అలల లాంటి ఆవేదనలు ఎన్నో!!
భరించి పెరగడమే ఆడపిల్ల జీవితం..

ఉమాదేవి ఎర్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *