అరుణోదయ కిరణాలు..
అరుణోదయ కిరణాలు..
ఏతెంచు వేళ..
తూరుపు దిశన అందాలు..
శోభించు వేళ..
కొండా కోనల్లో వెండి వెలుగులు..
ప్రసరించు వేళ..
సప్తాశ్వాలను ఎక్కి సూర్యభగవానుడు ప్రవేశించు వేళ..
ఆకాశపు అందాలు..
అధ్బుతాలను సృష్టించు వేళ..
అమ్మ లేపుతున్నా..
నిండా రగ్గు కప్పుకుని..
నే నిదురించు వేళ..
ఆకాశపు అందాలు చూడమని..
అమ్మ పిలిచే పిలుపుకి నా మది..
ఉవ్విళ్లూరుతుంది..
కానీ..
నా శరీరమే సహకరించడం లేదు కదా..
బలవంతంగా లేచి చూసిన ..
ఆ ప్రకృతి శోభ..
అరుదైన ( నాకు ) అందాన్ని..
వీక్షించు వేళ..
మనసు పరవశించి మధుర భావనలు పొంగి పొరలి..
కవిత రాయించింది నాతో..
నాలో ఊహలకు ..
నాలో ఊసులకు..
కవితా గానమై తరంగమై మది..
పులకించింది!!
ఉమాదేవి ఎర్రం