రోడ్డు విలాపం
ప్రతిరోజూ ఏమిటీ రక్తపాతం.
నాకు ఎందుకు ఈ రక్తాభిషేకం.
నిదానమే ప్రదానమని చెప్పినా
వాహనదారులు వినటంలేదు.
వేగంగా ప్రయాణిస్తూ రహదారి నియమాలు పాటించటంలేదు.
సీటుబెల్టు పెట్టుకోవటం లేదు.
హెల్మెట్ అసలే వాడటం లేదు.
మద్యపానం చేసి వాహనాలను
విచ్చలవిడిగా నడిపేస్తున్నారు.
రహదారి నియమాలనేవి ఎన్ని
ఉన్నా వాటిని పాటించరు.
ఇలా ప్రమదాలు జరుగుతూ
ఉంటే ప్రతిరోజూ రక్తాభిషేకమే.
నా ఏడుపు చూసి చంద్రుడు
కూడా చిన్నబోయాడు సుమీ.
ఆ ప్రమాదాలు చూసిన ఆ
ఆకాశం కూడా ఎఱ్ఱబడ్డది.
మానవుడికి ఇదేమి ప్రారబ్ధం.
నిదానంగా పో తమ్ముడూ.
చిరంజీవిగా బ్రతుకుతావు.
నువ్వు వేగంగా పోతే ఆ
యమపురికి చేరతావు.
వెంకట భానుప్రసాద్ చలసాని