నిశీధిలో
నిశీధిలో నేను ఒంటరిగా ఉండి
నా బాధ అయినా సంతోషమేనా
నాకెంతో ఇష్టమైన వయోలిన్ వాయిస్తూ
సముద్రానికి దగ్గర నిలబడి వయోలిన్ వాయించుకుంటూ నా బాధని చెప్పుకుంటాను..
అదే వయోలిన్ తో ఆనందంగా వాయించుకుంటూ
నా సంతోషాన్ని పంచుకుంటాను..
మనకి ఎవరు తోడు లేకపోయినా పంచభూతాలతో పంచుకుంటే
మన సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
అందుకే నా బాధ అయినా సంతోషమేనా ఈ సముద్రం ముందు పంచుకుంటూ
ఈ ప్రదేశంలో నిలబడి వయోలిన్ వాయించుకుంటే
ప్రతిరోజు ఒకే రాగం ఒకే పాటతో కాకుండా
వేరు వేరు రాగం పాటతో వాయిస్తూ ఉంటే
మనకి బోర్ కొట్టకుండా మనసుకి ఆనందంగా ఉంటుంది..
మనసును కాసేపు సంగీతం వైపు మళ్లించడం వల్ల
జరిగిన కొన్ని సంఘటనలను మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి..
నువ్వు నిశీధిలో ఒంటరిగా ఉన్నా బాధపడకు
నీకు తోడుగా ఉంది కదా వయోలిన్ వాయించుకోవడానికి
ఆ సంగీతం ద్వారా నిన్ను నువ్వు మర్చిపోయి
వేరే లోకానికి విహరిస్తూ ఉంటావు..
నీ నిశీధి ప్రయాణంలో ఎంతమంది వచ్చినా నీకు తోడు ఎవ్వరు ఉండకపోయినా బాధపడకు సుమీ..!
వయోలిన్ సంగీతం వింటుంటే మనసు పులకిస్తూ ఉంటుంది..
అందుకే ఆ వయోలిన్ వాయించడం అంటే నాకు ఎంతో ప్రీతి.
నేను నిశీధిలో ఉన్నాను అనే భయం నాకు లేదు.
మాధవి కాళ్ల